Header Banner

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కలకలం.. వారం రోజుల్లో 164 కొత్త కేసులు!

  Mon May 19, 2025 21:45        India

దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడటం గమనార్హం. అయితే దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, ఆ ప్రభావం కొంతమేర భారత్‌పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ..! ఎందుకంటే?

 

అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కేసుల వారీగా పరిశీలిస్తే, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి కోవిడ్ మరణాలు కావని వైద్యులు ధృవీకరించారు. మరణించిన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ వారు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ కారణాలతోనే మరణించారని వైద్యులు వివరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations